Dalai Lama : వారసుడి నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంది : భారత్

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా (Dalai Lama) వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోద ముద్ర కావాలంటూ చైనా (China) చేసిన డిమాండ్‌ను భారత్ (India ) తోసిపుచ్చింది. 15వ దలైలామా ను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మాట్లాడుతూ దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనే లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనది అని రిజిజు పేర్కొన్నారు.