India: ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం : భారత్

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న న్యూఢల్లీి తాజాగా మరో గట్టి షాకిచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతుల (Imports)పై నిషేదం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్ (India) కు వచ్చే అన్నిరకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం (Government of India) నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్‌లో వెల్లడిరచింది.