Prashant Kishore: ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : ప్రశాంత్ కిషోర్

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వీరిపై పోలీసులు (Police) జల ఫిరంగులు ప్రయోగించి లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులపై పోలీసుల చర్యలను జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఖండిరచారు. పేపర్ లీక్‌పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి (January) 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు.