ఐటీ రిటర్నులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30

పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2020-21కి గాను ఫైలింగ్ చేయాల్సిన వ్యక్తిగత ఐటీఆర్‍ల చివరి తేదీని రెండు నెలల పాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 30కి తీసుకెళ్లింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ సర్య్యులర్ విడుదల చేసింది. నిజానికి జూలై 31 వరకే ఈ గడువున్నది. మరోవైపు కంపెనీలకూ వెసులుబాటును కల్పించారు. అయితే నెల రోజులే పెంచారు. సంస్థాగత ఐటీఆర్ దాఖలు గడువు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30కి పెంచామని సీబీడీటీ తెలియజేసింది.