అనిల్ అంబానీకి షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానీని ఆదాయ పన్నుశాఖ ప్రాసిక్యూట్ చేయనుంది. 420 మేర పన్నులు ఎగవేశారని, రెండు స్వీస్ బ్యాంక్‌ల్లో 814 కోట్ల నల్లధనాన్ని దాచినట్లు ఆయనపై ఐటీ శాఖ అభియోగాలు మోపింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే విదేశీ బ్యాంక్ అకౌంట్ల గురించి సమాచారం ఇవ్వలేదని ఐటీశాఖ పేర్కొంది. విదేశాల్లో ఉన్న ఆస్తులు వివరాలు చెప్పనందుకు, లెక్కల్లో చూపని నల్లధనం కలిగి ఉన్నందుకు అనిల్ అంబానీ సెక్షన్ 50, 51 ప్రచారం ప్రాసిక్యూట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఆయనకు 10 సంవత్సరాలు పాటు జైలు శిక్షపడే అవకాశం ఉంది.






