Jungle Warfare: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం … దేశంలో తొలిసారిగా

పహల్గాం ఉగ్రదాడి సమయంలో ఉగ్రవాదులు దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా తీసుకొని పర్యాటకుల (Tourists)పై దాడి చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఇటువంటి ఉగ్రవ్యూహాలను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) లోని పోలీసులు, స్పెషల్ ఆపరేషన్‌స గ్రూప్ ( ఎస్‌ఓజీ) సిబ్బందికి జంగిల్ వార్‌ఫేర్ (Jungle Warfare) లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడిరచింది. కశ్మీర్, ఇతర సరిహద్దు ప్రదేశాల్లోని పర్వత ప్రాంతాలు, ప్రమాదకరమైన అటవీ భూభాగాలపై అవగాహన ఉన్న ఉగ్రవాదుల (Terrorists) ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో పోలీసుల (Police) కు యుద్ధ మెళకువల్లో శిక్షణనిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.