Supreme Court: మహిళలకు ఆ పోస్టులు ఇవ్వరా?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచీ పోస్టుల్లో మహిళ అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఆ పోస్టులకు స్రీ-పురుష నిస్ఫత్తి వర్తించదని నిబంధన ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు అనుసరించడం లేదని అడిగింది. రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ద విమానాలనే అమ్మాయిలు (Girls) నడుపుతున్నప్పుడు, లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సైన్యం లోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అఘ్నార్ కౌర్ (Aghnar Kaur), ఆస్థ త్యాగీ(Astha Tyagi) అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినప్పటికీ వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికి, మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత వాయుసేనలో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు, ఆర్మీ (Army)లోని లీగల్ బ్రాంచీల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో కష్టమేముంది? స్రీ -పురుష భేదంతో సంబంధం లేకుండా అవి తటస్ఠ పోస్టులను కేంద్రం చెప్పినప్పుడు మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులను కేటాయించడం లేదు? స్రీ`పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడం కాదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వడమే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.