భారతీయులకు శుభవార్త.. దేశంతో పాటు రూరల్ ఏరియూల్లో సైతం
భారతీయులకు శుభవార్త. త్వరలో మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో తొలిసారి హై త్రూపుట్ శాటిలైట్ బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే, దేశంతో పాటు రూరల్ ఏరియాల్లో సైతం హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వినియోగించుకునే అవకాశం కలగనుంది. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ హ్యూస్ కమ్యూనికేషన్స్ భారత్‌లో తొలిసారి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇస్రో ద్వారా హై త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ను ప్రారంభించనున్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి.






