దేశ రాజధానిలో కలకలం.. నార్త్ బ్లాక్ కు

దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. నార్త్ బ్లాక్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డీఎఫ్‌ఎస్)కు తెలియజేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదన్నారు.