దాతృత్వంలో నాడార్ టాప్.. రోజుకు రూ.3 కోట్లు
హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. ఈ ఏడాదికి గాను విడుదలైన ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ 9వ జాబితాలో రూ.1.161 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. సంవత్సర కాలంలో సగటున రోజుకు రూ.3 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్టు తెలింది. ఇక గతంలో పోల్చితే విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ డొనేషన్లు ఏకంగా 95 శాతం పడిపోయి ఈసారి రూ.484 కోట్లకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ టాప్`10లో రెండో స్థానంలో ఉన్నారు. కాగా దేశంలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ విరాళాలు కేవలం రూ.190 కోట్లుగానే ఉండటం గమనార్హం






