రికార్డు సృష్టించిన జీఎస్బీ….గణేశ్ మండపానికి రూ.316 కోట్ల బీమా!
ముంబైలోని గౌడ సారస్వత బ్రాహ్మణ (జీఎస్బీ) సేవా మండల్ ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లను దాటేసింది. ఈ ఏడాది గణపతి చతుర్థికి ఏర్పాటు చేసే తమ గణేశ్ మండపం కోసం ఏకంగా రూ.316 కోట్లకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ నుంచి బీమా తీసుకుని రికార్డు సృష్టించింది. బంగారు, వెండి ఆభరణాలు ఈ బీమాలో భాగమని తెలుస్తోంది. మొత్తం రూ.316 కోట్లలో రూ.31.97 కోట్లు రిస్క్ బీమా పాలసీ కావడం గమనార్హం.
సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వంటమనుషులు, చెప్పుల దుకాణ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.263 కోట్లు బీమాగా తీసుకున్నారు. అదే విధంగా అగ్నిప్రమాదం, భూకంపం వంటి వివిధ ప్రమాదాలకు సంబంధించి కోటి రూపాయల పాలసీని ఎంచుకున్నారు. తమ మహాగణపతికి సుమారు 66 కిలోలలకు పైగా బంగారు నగలు, 295 కిలోలకు పైగా వెండి, ఇతర విలువైన లోహాలతో చేసిన ఆభరణాలను అలంకరిస్తామని బీఎస్బీ సేవా మండల్ ప్రతినిధులు తెలిపారు.






