ఒకే ఫార్మాట్ లో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్
ప్రస్తుతం భారత్‌లో జారీచేసే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)ల ఫార్మాట్, రంగు, సైజులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. దీనివల్ల ఐడీపీలు పొందిన భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్ (ఎంవోఆర్టీహెచ్) దేశవ్యాప్తంగా ఐడీపీల జారీలో ఒకే ప్రామాణికతను అందబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ఐడీపీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒకే రకమైన ఫార్మాట్, రంగు, పరిమాణంతో కూడిన ఐడీపీ జారీ చేయనున్నారు.






