Air Raid Sirens: ప్రజలకు అవగాహన కోసమే మాత్రమే : కేంద్రం అడ్వైజరీ

భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) కి సంబంధించి ప్రాంతీయ, జాతీయ మీడియా (National media) విస్తృత కవరజీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్ల (Media channels ) కు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్‌ల (Mock drill) సమయంలో ప్రజలకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. ఇలా తరచుగా ఈ శబ్దాలు వినియోగించడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా అత్యవసర సమయాల్లో వీటిని ఉపయోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది అని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ విభాగాలు అడ్వైజరీ జారీ చేశాయి.