Fastag: కేంద్రం కీలక నిర్ణయం… ఫాస్టాగ్ వార్షిక పాస్

జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగా ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు ( ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు(Cars), జీపులు (jeeps) , వ్యాన్లు (vans) వంటి నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడిరచారు. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.