ఐటీ రిటర్నులకు శుభవార్త… నవంబర్ 7 వరకు
ఐటీ రిటర్నులకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు శుభవార్తను అందించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఐటీ రిటర్నుల గడువును ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ఐటీ రిటర్నులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 యాక్ట్ ప్రకారం అసెస్మెంట్ సంవత్సరం 2022-23 ఐటీ రిటర్నుల గడువును అక్టోబరు 31 నుంచి నవంబర్ 7 వరకు పెంచుతున్నట్లు సీబీడీటీ తన నోటిఫికేషన్లో వెల్లడిరచింది. మరోవైపు 2021`22 ఆర్థిక సంవత్సరానికి గాను దేశీయ కంపెనీలకు సంబంధించి ఐటీ రిటర్నులు వచ్చే నెల చివరి వరకు దాఖలు చేసుకోవచ్చును కూడా. ప్రస్తుత పండుగ సీజన్లో వ్యాపారస్తులకు ఇది శుభవార్త అని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.






