Gautam Adani: శాంతి విలువ ఏంటో భారత్‌కు తెలుసు : అదానీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సాయుధ దళాల పోరాటాన్ని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) కీర్తించారు. అదానీ గ్రూప్ 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై మాట్లాడారు. ఈ సందర్బంగా భారత్ (India)కు శాంతి విలువ ఏంటో తెలుసని ఆయన పేర్కొన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాయి. పేరు, ప్రతిష్టలు, పతకాల (Medals) కోసం కాకుండా విధి నిర్వహణలో భాగంగా పనిచేశారు. శాంతి ఉచితంగా రాదని, సంపాదించుకోవాలని వారి ధైర్యం మనకు గుర్తుచేసింది. శాంతి విలువ ఏంటో భారత్‌కు తెలుసు. అలా అని ఎవరైనా మనకు హాని కలిగించాలని చూస్తే, వారి భాషలో ఎలా స్పందించాలో కూడా మనకు బాగా తెలుసు అని అదానీ పేర్కొన్నారు.