త్వరలోనే మరో కొత్త పేమెంట్ ఫీచర్… గూగుల్ పే

త్వరలోనే మరో కొత్త పేమెంట్ ఫీచర్‍ను భారత్‍లో అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్ పే. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్ లో అందుబాటులో లేకపోయినా, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్‍ఎఫ్‍సీ ఫీచర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‍ఎఫ్‍సీ) అనే సరికొత్త ఫీచర్‍ను జోడించబోతోంది. ఇటీవలే క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి ఆ ఫీచర్‍ను ప్రారంభించినా మెయిన్ స్ట్రీమ్ పేమెంట్లకూ దానిని వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ ఫీచర్ పనిచేయాలంటే మాత్రం కచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఎన్‍ఎప్ సీ ఫీచర్‍ను సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‍లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 వంటి హై ఎండ్ ఫోన్లలోనే ఎన్‍ఎఫ్ సీ ఫీచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే అది అందరికీ అందుబాటులోకి రావాలంటే మాత్రం మరింత సమయం పడుతుందని చెప్పకతప్పదు.
ఎన్‍ఎఫ్‍సీ టెర్మినల్ దగ్గరకు ఫోన్ ను పెట్టినా లేదా ఫోన్‍లోని ఎన్‍ఎఫ్ సీని ట్యాప్ చేసినా నేరుగా గూగుల్ పే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కట్టాల్సిన అమౌంట్‍ను ఎంటర్ చేసి యూపీఐ పిన్ ను టైప్ చేసి ప్రొసీడ్ కొడితే పేమెంట్ జరిగిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో పైన్ ల్యాబ్ టెర్మినల్స్ కు చెందిన పీవోఎస్ లలోనే ఈ ఎన్‍ఎఫ్ సీ ఫీచర్ ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో పీవోఎస్‍లకూ పొడిగిస్తారని చెబుతున్నారు.