Ranya Rao: గోల్డ్ స్మిగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు ఊరట!

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు(Ranya Rao) తో పాటు తరుణ్ రాజ్ కొండూరు (Tarun Raj Kondur) కు బెంగళూరు కోర్టు (Bangalore Court) బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్‌ని ఇచ్చింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని, దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుడా దేశం విడిచి వెళ్లకూడదని, భవిష్యత్‌లో ఇతే తరహాలో నేరాల్లో పాల్గొనొద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ (Bail) రద్దవుతుందని హెచ్చరించింది.