భారత్ లో బంగారానికి డిమాండ్ తగ్గదు
భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కోవిడ్-19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్ తగ్గిపోతోందని నివేదిక అభిప్రాయపడిరది. ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’(డబ్ల్యూజీసీ నివేదిక) శీర్షికన నివేదికను విడుదల చేశారు. కోవిడ్-19తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2021 ముగిసేలోపు పసిడి డిమాండ్ ఊహించినదానికన్నా ఎక్కువగా పడిపోయే వీలుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు క్రమంగా సడలిపోతున్న నేపథ్యంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడే వీలుంది. 2022 నాటికి డిమాండ్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా మూడవ వేవ్ సవాళ్లు తలెత్తితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది.






