ఆసియా కుబేరుల్లో అదానీకి… రెండో స్థానం

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చరిత్రను సృష్టించారు. ఆసియా సంపన్న వర్గాల జాబితాలో రెండో స్థానానికి దూసుకుపోయారు. చైనాకు చెందిన జాంగ్ షాన్‍షన్‍ను వెనక్కి నెట్టి అదానీ ఈ ఘనత సాధించారు. ఆయనకు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా పుంజుకోవడంతో ఈ స్థానానికి చేరుకున్నట్లు తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఏడాదికాలంగా ఆదానీ సంపద విలువ 3,270 కోట్ల డాలర్ల మేర పెరుగడంతో ఆయన నికర విలువ 6,650 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఆసియాలో అత్యంతధనికుడిగా అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ సంపద ఏడాదిలో 17.55 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుతం ఆయన సంపద 7650 కోట్ల డాలర్లు. ప్రస్తుతం ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో వుండగా, అదాని 14వ స్థానంలో ఉన్నారు.