గౌతమ్ అదానీ మరో ఘనత… ప్రపంచంలోనే
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్ల డించింది. ఆయన ఆస్తులు సుమారు 137 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్న కుబేరుల్లో ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ నిలిచారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఆస్తులు 251 బిలియన్లు డాలర్లు కాగా, అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బేజోస్ ఆస్తుల విలువ 153 బిలయన్ల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త లూయిస్ విటాన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను ను దాటేసి అదానీ మూడవ స్థానానికి చేరుకున్నారు. ఆసియాకు చెందిన సంపన్నుల్లో తొలిసారి ఆ జాబితాలో చేరారు. భారత టైకూన్ ముకేశ్ అంబానీ, చైనాకు చెందిన అలీబాబా గ్రూపు జాక్ మా సంపన్నుల జాబితాలో ఉన్నా.. వాళ్లెప్పుడు కూడా టాప్ త్రీ ప్లేస్‌లోకి రాలేదు.






