ఇస్రో కీలక ప్రకటన … 2025లో కాదు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మావన సహిత మిషన్ గగన్‌యాన్ మిషన్ కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా, ఈ మిషన్‌ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా సోమనాథ్ ఈ కొత్త షెడ్యూల్‌ను వెల్లడిరచారు.