మరోసారి కలకలం ఒక్కరోజే… 70కి పైగా విమానాలకు!

దేశీయ సంస్థల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే 70కిపైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. వాటిలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్ విమానాలున్నాయి. మొత్తంగా 11 రోజుల వ్యవధిలో 250 ఫైట్లకు ఈ బెదిరింపులు వచ్చాయి.