Farooq Abdullah: అలా జరగకుండా ఉండాలంటే .. వారిని తొందరగా పట్టుకోవాలి : ఫరుక్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనపై భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక(Farooq Abdullah) వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిరచారు. పాకిస్థాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కశ్మీర్ (Kashmir) లోని భద్రతా, ఇంటెలిజెన్స్ (Intelligence) లోపాలను ఆయన ఎత్తి చూపారు. రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. ఇరుదేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) జరగడానికి కారణమైన ఉగ్రవాదులు (Terrorists) , దాని వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రతా, ఇంటెలిజెన్స్‌లో ఉన్న లోపాలు కూడా ఉగ్రవాడి జరిగేందుకు కారణమని అనడంలో సందేహం లేదు అని అబ్దులా వ్యాఖ్యానించారు.