India: ఇకపై దేశవ్యాప్తంగా అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్ #112

దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్‌ఫ్రీ నంబర్ – 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు పోలీస్ సహాయం (100), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181).. బాలల హక్కుల పరిరక్షణ (1098), ప్రకృతి విపత్తుల (1077) వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నంబర్లను ప్రజలు ఉపయోగించేవారు.
అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నంబర్ – 112 కొనసాగనుంది.
112 నంబర్‌కు ఫోన్ చేయగానే, కాల్ కేంద్రం లొకేషన్‌ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి.. సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది.