Maharastra: తేలికగా తీసుకుంటే సీన్ సితారే.. షిండే వ్యాఖ్యలపై కలకలం

మహాయుతిలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయా..? కూటమిలోని పార్టీల మధ్య అగాధం అంతకంతకూ పెరిగిపోతోందా..? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. లేటెస్టుగా శివసేన అధ్యక్షుడు , మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘‘నేను ఓ సాధారణ పార్టీ కార్యకర్తను. అంతేకాదు బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలి. 2022లో అందరూ నన్ను తేలిగ్గా తీసుకున్నప్పుడు.. నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా’’ అని పేర్కొన్నారు.
‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపూర్తివేగంతో పనిచేస్తోంది. మేం ఎన్నికల్లో 200కుపైగా స్థానాల్లో గెలుస్తామని నేను, ఫడణవీస్ చెప్పాం. మేం 232 సీట్లలో గెలిచాం’’ అని పేర్కొన్నారు. ‘‘నన్ను తేలికగా తీసుకోవద్దు. అర్థం చేసుకునేవారికి ఈ సూచన సరిపోతుంది’’ అని షిండే పరోక్షంగా వార్నింగిచ్చారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Fadnavis)తో విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరైన పలు అధికారిక కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉండటం ‘మహా’ రాజకీయాల్లో ఆసక్తికంగా మారింది (Maharashtra).ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని థానే జిల్లా బద్లాపూర్‌లో ఆగ్రా కోట వేదికగా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం హాజరవగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉన్నారు. అంతేకాకుండా అంబేడ్గావ్ బద్రుక్‌లో శివశ్రుతి థీమ్ పసార్క్ రెండో దశ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం హాజరైనా డిప్యూటీ సీఎం మాత్రం కనిపించలేదు.
మహాయుతి గెలుపు తరువాత ముఖ్యమంత్రి పోస్టు ఏక్‌నాథ్ షిండేకు రాకపోవడంతో ఆ వర్గంలో అసంతృప్తి అప్పుడే బయటపడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తరువాత కొందరు ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీ తొలగింపు చర్యల ఈ విభేదాలను మరింత పెంచిందని చెబుతున్నారు. షిండే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో అప్పట్లో 44 ఎమ్మెల్యేలకు, 11 మంది ఎంపీలకు ఈ భద్రతను ఇచ్చారు.. తాజాగా వాటిని తొలగించారు. వై సెక్యూరిటీ కోల్పోయిన వారిలో అన్ని పార్టీల నేతలు ఉన్నా షిండే వర్గం వారే అత్యధిక మంది ఉన్నారు. అయితే, వీరెవరికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ఇక శివ సేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ మధ్య కూడా అంత సఖ్యత లేదన్న వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. మహాయుతి విజయంలో కీలక పాత్ర పోషించిన లాడ్కీ బహెన్ యోజనకు సంబంధించి ఎన్సీపీ ప్రచార కార్యక్రమాల్లో పథకం పేరు ముందు… ముఖ్యమంత్రి అన్న పదం లేకపోవడంపై షిండే వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఎన్సీపీ వర్గాలు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదని అంటున్నాయి.
ఇక నాశిక్, రాయ్‌గఢ్ గార్డియన్ మినిస్టర్లుగా ఎన్సీపీ నేత అదితీ టట్కరే, బీజేపీ నేత గిరీశ్ మహాజన్ నియామకంపై కూడా శిండే అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో 2027 జరగనున్న నాశిక్ కుంభమేళా ఏర్పాట్లపై ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ఏక్‌నాథ్ శిండే కనిపిేంచలేదు. ఈ అనుమానాలను బీజేపీ సీనియర్ నేత ఆశిష్ షేలార్ కొట్టిపారేశారు. కూటమి సభ్యుల్లో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు