South India: బార్లు నడిపే దక్షిణాది వారికి కాంట్రాక్టులు ఇవ్వొద్దు: శివసేన నేత షాకింగ్ వ్యాఖ్యలు

దక్షిణాదిపై (South India) మహారాష్ట్రకు చెందిన శివసేన (ShivSena) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి దారితీశాయి. ఇటీవల కొలాబాలోని ఒక క్యాంటీన్‌లో కుళ్లిపోయిన ఆహారం వడ్డించినందుకు ఆ క్యాంటీన్ సిబ్బందిపై సంజయ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో ఆహార సరఫరా కాంట్రాక్టుల గురించి మాట్లాడిన ఆయన.. ఈ కాంట్రాక్టులును దక్షిణాది (South India) ప్రజలకు ఇవ్వకూడదనడం వివాదాస్పదమైంది. దక్షిణాది ప్రజలు “డ్యాన్స్ బార్‌లు, లేడీస్ బార్‌లను” నడుపుతున్నారని, ఇలాంటి వాళ్లు మహారాష్ట్ర సంస్కృతికి హానికరమని సంజయ్ (Sanjay Gaikwad) ఆరోపించారు. “శెట్టి అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఎందుకిచ్చారు? మరాఠీ వాళ్లకు ఇవ్వండి. మేము ఏమి తింటామో వారికి తెలుసు, కాబట్టి వారు మాకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. దక్షిణాది (South India) ప్రజలు డ్యాన్స్ బార్‌లు, లేడీస్ బార్‌లను నడుపుతారు. వారు మహారాష్ట్ర సంస్కృతిని పాడు చేస్తారు. వారు మా పిల్లలను కూడా చెడగొడుతున్నారు” అంటూ ఆయన (Sanjay Gaikwad) చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కొలాబాలోని క్యాంటీన్‌లో సంజయ్ గొడవ చేసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ క్యాంటీన్‌లో తనిఖీలు చేపట్టి, దాన్ని రద్దు చేశారు.