Donald Trump : ట్రంప్ పేరుతో నకిలి యాప్.. 150 మంది నుంచి

సైబర్ నేరగాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్ (App) ను రూపొందించి 150 మందిని మోసం చేసి రూ.కోటి వసూలు చేశారు. ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతోయాప్ క్రియెట్ చేసిన స్కామర్లు ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్దమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు (Bangalore) , తమకూరు, మంగళూరు (Mangalore), హవేరి వరకు ప్రజలు యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ద్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. కొన్ని రోజుల పాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువత కొంతకాలానికి యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసులు అధికారులు వెల్లడిరచారు.