Jagdeep Dhankhar: ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది : ధన్‌ఖడ్

ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్ లాడెన్ (Bin Laden) ను అమెరికా (America) హతమార్చిన ఘటనతో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను పోల్చారు. భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాక్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరి ఉగ్రమూకలను ఏరివేసిందని వ్యాఖ్యానించారు. 2011, మే 2న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా ఒక బెంచ్ మార్క్‌కను నిర్ణయించింది అని ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లోని జరిగిన ఓ కార్యక్రమంలో ధన్‌ఖడ్ పేర్కొన్నారు. భారత్ ఎంతో కచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్రమూకలకు మాత్రమే నష్టం వాటిల్లిందని అన్నారు.