Air India : ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశం… ఆ ముగ్గురు అధికారులను

గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్ (London) బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో బిల్డింగ్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగుల (Employees) ను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ముగ్గురు అధికారుల్లో ఎయిర్‌లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ (Vice President) కూడా ఉన్నట్లు తెలిసింది.