టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త.. 6650 మంది ఉద్యోగులపై వేటు!
టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతోందని కో`చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు.






