బగ్ కనిపెట్టి రూ.22 లక్షలు గెలుచుకున్న… భారతీయ యువతి

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ పోగ్రాంలను అప్‍డేట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో లోపాలు ఉంటాయి. అలాంటి వాటిని ముందుగానే కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారిని నగదు బహుమతి అందజేస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కు ఎదురైన ఓ సమస్యను గుర్తించి 22 లక్షల రూపాయల నజరానా అందుకుంది ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతి అదితి సింగ్. మెడికల్ ఎంట్రన్స్ లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‍పై దృష్టి సారించిన ఆమె.. ఇప్పటి వరకు దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్‍లను కొనుగోన్నట్లు పేర్కొంది.
తాజాగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సిస్టంలో రిమోట్ కోడ్ ఎక్స్క్యూష్ బగ్‍ను కనిపెట్టి భారీ నగదు పొందింది. తాను ఇప్పటి వరకు తీసుకున్న నజరాల్లో ఇదే పెద్దదని అదితి తెలిపింది. కాగా, అదితి మొదటగా ఈ బగ్ గురించి చెప్పినప్పుడు మైక్రోసాఫ్ట్ పట్టించుకోలేదట. బగ్ ఉన్న పోగ్రాంను యూజర్స్ డౌన్‍లోడ్ చేసుకోవపోవడం చూసి తర్వాత లోపాన్ని సరిచేస్తున్నారట.