Nepal: తెలంగాణ వాసుల కోసం .. ఢిల్లీ లో సహాయ కేంద్రం

నేపాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణ (Telangana) వాసులు అక్కడ చిక్కుకున్నారు. వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ (Delhi)లోని తెలంగాణ భవన్‌లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతలు అప్పగించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ (Nepal) లో ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రధాని, వివిధ శాఖల మంత్రులు (Ministers) రాజీనామాలు చేశారు. దీంతోపాటు రాజకీయ వారసత్వాలపై నేపాల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. వీటిని నెపోకిడ్ మూమెంట్ గా పిలుస్తున్నారు.