India: సరిహద్దుల్లో భద్రత పెంచిన భారత్

జెన్ జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్ (Nepal) లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramachandra Paudel) నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడిరచారు. రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా పెల్లుబికిన ఆందోళనల తీవ్రతకు కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) ప్రధాని పదవికి రాజీనామా (Resignation) చేయాల్సి వచ్చింది. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సైనికులు రాజధాని కాఠ్‌మాండా వీధుల్లో కాస్తున్నారు.