Nara Lokesh: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించాల్సింగా అన్నామలైని లోకేష్ ఆహ్వానించారు.