Delhi Court: సోనియా, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. దీనిపై తదుపరి విచారణను మే 8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జీషీట్‌లో సరైన పత్రాలు లేని కారణంగా రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ చర్యలు తీసుకుంది.