Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ .. ఎట్టి పరిస్థితుల్లోనూ

పాకిస్థాన్ (Pakistan )లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు పాక్ యత్నించగా, వీటిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సహనాన్ని అలుసుగా తీసుకుంటే ఆపరేషన్ సిందూర్ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ (National Quality Conclave) లో మాట్లాడుతూ దేశభద్రతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. మేం ఎల్లప్పుడూ సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని విశ్వసిస్తాం. దీనర్థం ఎవరైనా మా ఓపికను దుర్వినియోగం చేయవచ్చని కాదు, మా సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే, ఆపరేషన్ సిందూర్ మాదిరిగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని పేర్కొన్నారు.