Dalai Lama: చైనాకు షాకిచ్చిన దలైలామా!

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా (Dalai Lama) తాజాగా చైనా (China) కు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్ (Gaden Phodrong Trust) కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ (Tibet) బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి, తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు వెల్లడిరచారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్లు తెలిపారు.