Dalai Lama : అట్టహాసంగా దలైలామా పుట్టినరోజు వేడుకలు

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు(Birthday celebrations) హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ధర్మశాలలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు, రాజకీయ నేతలు(Political leaders), ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులు, వేలమంది టిబెటన్లు తరలివచ్చారు. దలైలామా(Dalai Lama) మాట్లాడుతూ ప్రజల ప్రేమే తనను అన్ని జీవులకు సేవ చేసే మార్గంలో నడిపిస్తోందని అన్నారు. కరుణ, జాలి కలిగిన హృదయంతో జీవించడం వల్ల మనశ్శాంతిని పొందగలం. నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితాన్ని వృథా చేశానని అనుకోవటంలేదు. దలైలామా బిరుదుతో నాకు ఎటువంటి గర్వం, అహంకారం లేదు. బుద్ధుడి అనుచరుడిగా, భిక్షువుగా ప్రజలకు సేవ చేయడమే నా జీవిత ప్రధాన ధ్వేయం అని దలైలామా వ్యాఖ్యానించారు.