Covid : దేశంలో మరోసారి కొవిడ్ వేరియంట్లు

దేశంలో కరోనా వైరస్ (Corona virus) గురించి మర్చిపోతున్న తరుణంలో మరోసారి పంజా విసురుతోంది. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్ కొత్త వేరియంట్ల ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కాన్సర్టియం (Genomics Consortium) వెల్లడిరచింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో బయటపడగా, ఎల్‌ఎఫ్.7కు సంబంధించి నాలుగు కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు (Tamil Nadu), గుజరాత్ (Gujarat)లో నమోదయ్యాయి. ఢల్లీి, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులను గుర్తిస్తున్నారు. మూడేళ్లలో తొలిసారి ఢల్లీిలో 23 మందికి వైరస్ సోకిందని తెలిసింది. దాంతో అన్ని ప్రభుత్వాలు అసుపత్రులను అప్రమత్తతం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ, తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.