India: ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ

యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా (Corona) మహమ్మారి కొన్ని దేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్ ( Hong Kong), సింగపూర్ (Singapore), థాయ్‌లాండ్ (Singapore )తో పాటు చైనాలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ, తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.