Siddaramaiah : మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు ఆయనకే.. సీఎం కావడం ఖాయం

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని చెప్పినా ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని ఓ వైపు సిద్ధరామయ్య (Siddaramaiah) చెబుతున్నా అక్కడి పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సీఎం పదవిని ఆశిచడంలో తప్పులేదు కదా అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) బహిరంగంగా తన కోర్కెను వెల్లడిరచడంతో సీఎం మార్పు అంశం తార స్థాయికి వెళ్లింది. తాజాగా డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ (CP Yogeshwar) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యే (MLA ) ల మద్దతు, ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి (Chief Minister) కావడం ఖాయం ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్మెల్యే, ప్రజలు ఇదే కోరుకుంటున్నారు అని యోగేశ్వర్ అన్నారు.