Congress : కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడమేంటి?

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ప్రకటన చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party )తప్పుబట్టింది. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), కాల్పుల విరమణ ఒప్పందం , ట్రంప్ ప్రకటన తదితరఅంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రధానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ఖర్గే లేఖలు రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలనే ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనను నేను పునరుద్ఘాటిస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తోపాటు కాల్పుల విరమణను తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉంది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు మన సమష్ఠి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం అని రాహుల్ పేర్కొన్నారు.