Omar Abdullah: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.గత రెండు రోజుల నుంచి జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) సరిహద్దు ప్రాంతాలపై పాక్ (Pakistan) జరుపుతున్న దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతు (Support) గా నిలుస్తుందని హామీ ఇచ్చారు.