వెబెక్స్ ఇండియాకు టెలికాం లైసెన్సు
అమెరికా టెలికాం గేర్ తయారీ సంస్థ సిస్కో అనుబంధ సంస్థ వెబెక్స్ ఇండియా ప్రభుత్వం నుంచి టెలికాం లైసెన్సు లభించింది. ఈ లైసెన్సుతో ఎంటర్ప్రైజ్ శ్రేణి జాతీయ, అంతర్జాతీయ టెలికాం అనుసంధానత సేవలను అందించనుంది. టెలికాం లైసెన్సు పొందిన మొదటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థగా వెబెక్స్ అవతరించింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలకు వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఈ కంపెనీ పనిచేస్తోంది. జులైలో కంపెనీకి వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ లైసెన్సు లభించింది. సిస్కోకు టెలికాం లైసెన్సు లభించిన విషయాన్ని కంపెనీ అదికార ప్రతినిధి ధ్రువీకరించారు. జాతీయ లాంగ్ డిస్టెన్స్, అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ సేవలకు యునిఫైడ్ లైసెన్సును వెబెక్స్ పొందింది.






