ఆ రూల్స్ తో ఇబ్బందులు… సీఐఐ

ఆడిటర్లకు ఆర్‍బీఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) నిబంధనల మార్పుతో కార్యాచరణలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పేర్కొంది. ఈ కొత్త నిబంధనల వల్ల బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర సంస్థలకు విఘాతం కల్గుతుందని సంస్థ తెలిపింది. ఏప్రిల్ 27న సెంట్రల్ బ్యాంక్ కొత్త నిబంధనలను జారీ చేసింది. బ్యాంకులు, రూ.1000 కోట్ల లోపు అసెట్ బేస్ కల్గిన బ్యాంకింగ్ యేతర సంస్థలు మూడేళ్లు పూర్తి అయినట్లయితే వెంటనే కొత్త ఆడిటర్లను తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఎన్‍బిఎఫ్‍సీ మార్పులు చేయవచ్చు.