ఓసీఐ మిత్రులకు లక్ష ఈ-వీసాలు

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు భారత్ చలో ఇండియా క్యాంపెయిన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే వరల్డ్ ట్రావెల్ మార్ట్ సందర్భంగా లండన్‌లో ప్రారంభిస్తారు. విదేశాల్లోని భారతీయుల స్నేహితుల కోసం ఉచిత వీసాలను జారీ చేస్తారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ హోల్డర్‌లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఒక ఓసీఐ కార్డ్ హోల్డర్ ఐదుగురు విదేశీయులను ప్రత్యేక పోర్టల్ ద్వారా నామినేట్ చేయవచ్చు. ఆ ఐదుగురికి ఎటువంటి రుసుమును వసూలు చేయకుండా ఉచితంగా గ్రాటిస్ ఈ`వీసాలను ప్రభుత్వం జారీ చేస్తుంది. మొత్తంగా లక్ష ఉచిత ఈ-వీసాలను జారీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.