Ladakh: కేంద్రం కీలక ప్రకటన … లద్దాఖ్‌లో

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ (Ladakh)లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల (Reservation) అంశంపై అధికారిక ప్రకటన చేసింది. 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించింది. 15 ఏళ్లకు మంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు, కనీసం 7 ఏళ్లపాటు అక్కడ చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైనవారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది. అంతేకాకుండా లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (Autonomous Hill Development Council) లో మూడులో ఒక వంతు సీట్లు మహిళల (Women’s) కే కేటాయించనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.