CPI(M): కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా.. ససేమిరా అంటోంది

మావోయిస్టు అధిపతి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) సహా 27 మందిని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడాన్ని సీపీఐ(ఎం) (CPI(M)) తీవ్రంగా ఖండిరచింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందా మని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ససేమిరా అంటూ ఒప్పుకోలేదని, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రాణాలను బలిగొంటోందని ఆక్షేపించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో (Party Politburo) ఓ ప్రకటన విడుదల చేసింది. అటు కేంద్రం గానీ, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం గానీ చర్చలకు అంగీకరించడం లేదని ప్రకటనలో పేర్కొంది. చర్చలకు ముందుకు రాకుండా నిర్మూలన అనే అమానవీయ విధానాన్ని కేంద్రం అవలంబిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మావోయిస్టుల అంతానికి గడువు దగ్గరపడుతోందని పదేపదే చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి కూడా చర్చలు అనవసరమంటున్నారు. ఈ ఇద్దరి తీరు ఫాసిస్టుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని సీపీఐ(ఎం) పేర్కొంది. ప్రజలు, పలు రాజకీయ పార్టీలు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలకు చెవికెక్కడం లేదని ఆరోపించింది.