కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జూన్ 25న

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినం గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్య దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన మోధులకు ఆ రోజున గుర్తుచేసుకుందాం అని అన్నారు.